ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయింది, వీకెండ్ వరకు అంచనాలను మించి వసూళ్ళని సాధించినా కానీ ఇప్పుడు వర్కింగ్ డేస్ లో సినిమా కొద్దిగా స్లో డౌన్ అవుతుంది అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో అంచనాలను మించి వసూళ్ళని సొంతం చేసుకున్నా కానీ వర్కింగ్ డేస్ లో మాత్రం…
అంచనాలను అందుకునేలా కాకున్నా కొంచం స్లో డౌన్ అయింది అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజు 4 కోట్ల నుండి 4.5 కోట్ల రేంజ్ కి వెళుతుంది అనుకున్నా కానీ డ్రాప్స్ అనుకున్న దానికన్నా కొంచం ఎక్కువగానే సొంతం చేసుకున్న పుష్ప సినిమా మొత్తం మీద 5 వ రోజు…
రెండు తెలుగు రాష్ట్రాలలో 3.87 కోట్ల షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది, కానీ అదే టైం లో సినిమాను ఇతర భాషల కలెక్షన్స్ కాపాడుతూ వస్తున్నాయి అని చెప్పాలి. హిందీలో, తమిళ్ లో, కన్నడలో సాధిస్తున్న కలెక్షన్స్ గ్రోత్ వలన సినిమా ఇప్పుడు 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది.
బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు 5 రోజుల్లో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 31.11Cr(inc GST)
👉Ceeded: 10.56Cr
👉UA: 5.55Cr
👉East: 3.72Cr
👉West: 3.12Cr
👉Guntur: 4.04Cr
👉Krishna: 3.30Cr
👉Nellore: 2.37Cr
AP-TG Total:- 63.77CR(96.05CR~ Gross)
👉Karnataka: 8.45Cr
👉Tamilnadu: 6.85Cr(corrected)
👉Kerala: 2.91Cr
👉Hindi: 9.90Cr
👉ROI: 1.96Cr
👉OS – 9.41Cr
Total WW: 103.25CR(177CR~ Gross)
ఇదీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క. సినిమాను మొత్తం మీద 146 కోట్ల టార్గెట్ తో బరిలోకి దింపగా సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలి అంటే ఇంకా 42.75 కోట్ల షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. లాంగ్ రన్ లో సినిమా ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.