మమ్మోత్ ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డులతో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉంది, కానీ రిలీజ్ కి ముందు మిగిలిన ఇండస్ట్రీల విషయంలో ఎలా ఉన్నా కానీ హిందీ లో సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ ని అందుకుంటుంది, బాక్స్ అఫీస్ దగ్గర ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా బుకింగ్స్ అసలు ఏమాత్రం ఎంకరేజింగ్ గా లేక పోవడం, దానికి తోడూ…
ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా జోరు కొనసాగడం, రాధే శ్యామ్ అక్కడ తీవ్రంగా నిరాశ పరచడం లాంటివి ఆర్ ఆర్ ఆర్ పై అనుమానాలను కలిగేలా చేశాయి, కానీ ఒక్కసారి ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత ఆర్ ఆర్ ఆర్ కి ఆడియన్స్ నుండి యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో…
కలెక్షన్స్ పరంగా తొలిరోజు నుండి మంచి ట్రెండ్ ని చూపెట్టడం మొదలు పెట్టిన ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 91.50 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపగా ఇప్పుడు 5 వ రోజు కూడా అవలీలగా ఇప్పుడు…
15 కోట్ల రేంజ్ కి తగ్గని నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అక్కడ 5వ రోజు సాధించిన కలెక్షన్స్ తో సినిమా ప్రతిష్టాత్మక 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని దూసుకు పోతుంది అని చెప్పాలి. 5 రోజుల్లో టోటల్ గా కలెక్షన్స్ అటూ ఇటూగా 106 కోట్ల రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉండగా సినిమా హిందీ లో హిట్ అవ్వాలి అంటే మినిమమ్…
190 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది, ఆ లెక్కన సినిమా ఇంకొంచం కష్టపడితే సరిపోతుంది, సెకెండ్ వీకెండ్ అక్కడ సినిమా బ్యాటింగ్ నెక్స్ట్ లెవల్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీ లో సినిమా బ్యాటింగ్ చూస్తుంటే ఇప్పట్లో ఆగే అవకాశం అయితే అస్సలు లేదనే చెప్పాలి… ఇక లాంగ్ రన్ లో సినిమా ఎంత దూరం వెళుతుందో చూడాలి.