బాక్స్ ఆఫీస్ దగ్గర మరో సారి అంచనాలను మించి జోరు చూపుతూ దూసుకు పోయింది ఆర్ ఆర్ ఆర్ మూవీ… మొదటి వీకెండ్ సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో కి ఎంటర్ అయిన సినిమా మిగిలిన సినిమాల మాదిరి వీకెండ్ తర్వాత అంచనాలను అందుకోలేకుండా ఉండకుండా 4 వ రోజు అంచనాలను మించి పోయిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 5వ రోజు కూడా…
అంచనాలను మించి పోయి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా 12 కోట్ల నుండి 13 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని అంచనా వేయగా ఆ అంచనాలను కూడా మించి పోయిన సినిమా…
తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 13.63 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని దుమ్ము దులిపేసింది. ఇక 5వ రోజు వరల్డ్ వైడ్ గా 25 కోట్లకు పైగా షేర్ రావడం పక్కా అనుకోగా సినిమా ఏకంగా 30 కోట్ల మార్క్ ని కూడా అధిగమించి ఏకంగా 31.5 కోట్లకు పైగా షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది…
మొత్తం మీద సినిమా ఇప్పుడు 5 రోజులు పూర్తీ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 68.35Cr
👉Ceeded: 34.18Cr
👉UA: 19.32Cr
👉East: 10.41Cr
👉West: 9.17Cr
👉Guntur: 13.32Cr
👉Krishna: 10.00Cr
👉Nellore: 5.88Cr
AP-TG Total:- 170.63CR(253.10CR~ Gross)
👉KA: 24.85Cr
👉Tamilnadu: 21.80Cr
👉Kerala: 5.35Cr
👉Hindi: 53.30Cr
👉ROI: 4.65Cr
👉OS – 67.60Cr
Total WW: 348.18CR(Gross- 624CR~)
ఇదీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించిన కలెక్షన్స్ భీభత్సం… సినిమా బ్రేక్ ఈవెన్ కోసం మొత్తం మీద 453 కోట్ల మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా 5 రోజుల తర్వాత క్లీన్ హిట్ మార్క్ ని అందుకోవాలి అంటే ఇంకా 104.82 కోట్ల షేర్ మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది, ఈ మార్క్ ని సినిమా అతి త్వరలోనే అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.