మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు అల్టిమేట్ కలెక్షన్స్ తో రచ్చ రచ్చ చేసింది, సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ కలెక్షన్స్ తో ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసింది. 8.33 కోట్ల షేర్ ని అందుకున్న సైరా నరసింహా రెడ్డి నాన్ బాహుబలి సినిమాలకు కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది.
సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో చూపెట్టిన జోరు మిగిలిన చోట్లా అంతంత మాత్రంగానే ఉందని చెప్పాలి. హిందీ, తమిళ్ మరియు కేరళలో సినిమా భారీ గా అండర్ పెర్ఫార్మ్ చేస్తూ బిజినెస్ ని అందుకునే దిశగా మాత్రం అడుగులు వేయడం లేదు. అదొక్క ఎఫెక్ట్ తప్పితే..
మిగిలిన చోట్ల సైరా జోరు కొనసాగుతుంది, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల లోనే సినిమా ఇప్పటి నుండి మేజర్ కలెక్షన్స్ ని సాధించాల్సిన అవసరం నెలకొంది అని చెప్పాలి. ఇక సినిమా 5వ రోజుకి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా 10.13 కోట్ల షేర్ ని అందుకుంది. ఇక సినిమా 5 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ గా…
సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను పరిశీలిస్తే
?Nizam: 19.68C
?Ceded: 12.13C
?UA: 10.07C
?East: 7.44C
?West: 5.75Cr
?Guntur: 7.39C
?Krishna: 5.38C
?Nellore: 3.19C
AP-TG: 71.03C
Karnataka – 9.35Cr
Tamil – 1.11Cr
Kerala – 0.64Cr(*Corrected)
Hindi& ROI- 4.60Cr
USA/Can- 7.55Cr
ROW- 3.42Cr
5 days Total – 97.70Cr(160.5cr Gross)
సినిమాను టోటల్ గా 187.25 కోట్లకు అమ్మగా 188 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో 90.30 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, కనీసం మరో 2 వారాలు నాన్ స్టాప్ గా సినిమా జోరు బాక్స్ ఆఫీస్ దగ్గర కొనసాగాల్సి ఉంటుంది. ఇక 6 వ రోజు సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి…