టాక్సీవాలా 5 డేస్ టోటల్ కలెక్షన్స్…బ్లాక్ బస్టర్

0
248

     గీత గోవిందం హిస్టారికల్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన నోటా భారీ డిసాస్టర్ గా మిగిలి పోగా అప్పటికే నెట్ లో లీక్ అయిన టాక్సీవాలా పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు కానీ రిలీజ్ సమయానికి ఒక సింపతీ ఏర్పడింది. సినిమా కూడా మొదటి ఆటకే మంచి టాక్ ని సొంతం చేసుకోవడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్ళతో దూసుకు పోతుంది ఈ సినిమా. కాగా సినిమా….

5 రోజుల్లో టోటల్ గా రెండు రాష్ట్రాలలో 10.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. అందులో నైజాం లో 4.1 కోట్లు, సీడెడ్ లో 1.05 కోట్లు టోటల్ ఆంధ్రా లో 5.65 కోట్ల దాకా షేర్ ని అందుకోగా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.85 కోట్లు…

టోటల్ ఓవర్సీస్ లో 1.7 కోట్ల షేర్ ని సాధించింది. దాంతో 5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 14.35 కోట్ల షేర్ ని అందుకుంది. టోటల్ గ్రాస్ 25 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. కాగా సినిమాను రిలీజ్ కి ముందు 18 కోట్ల రేంజ్ లో అమ్మినట్లు వార్తలు రాగా….

తర్వాత నిర్మాత చాలా ఏరియాల్లో ఓన్ గా రిలీజ్ చేసుకోవడంతో మిగిలిన ఏరియాల బిజినెస్ 7 కోట్ల రేంజ్ లో ఉంది. ఆ బిజినెస్ కి టోటల్ గా సినిమా 5 రోజుల్లోనే ఏకంగా 14.35 కోట్ల షేర్ ని అందుకుని డబుల్ ప్రాఫిట్ ని సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలవబోతుంది.

ఇక రోబో 2 వరకు ఈ సినిమా కలెక్షన్స్ ఇలాగే కొనసాగే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. టోటల్ గా సినిమా లీక్ అయ్యి అంచనాలు ఏమి లేకుండా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించి సినిమా రియల్ బాక్స్ ఆఫీస్ విన్నర్ గా నిలిచింది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!