Home న్యూస్ 5 సినిమాల డే 1 కలెక్షన్స్ ప్రిడిక్షన్స్

5 సినిమాల డే 1 కలెక్షన్స్ ప్రిడిక్షన్స్

258
0

  ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు 5 పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. 5 సినిమాలు వేటి కవే స్పెషల్ గా రిలీజ్ అవుతుండగా వాటి లో ముందుగా తెలుగు సినిమాల విషయానికి వస్తే పడిపడిలేచే మనసు మంచి బజ్ నడుమ రిలీజ్ అవుతుండగా తొలిరోజు బుకింగ్స్ బట్టి సినిమా 3 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకునే చాన్స్ ఉందని చెప్పొచ్చు. ఇక వరుణ్ తేజ్ అంతరిక్షం ప్రయోగాత్మక సినిమా అవ్వడం బుకింగ్స్ అనుకున్న రేంజ్ లో లేవు.

టాక్ బాగుంటేనే ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉండటం తో తొలిరోజు ఈ సినిమా 2 కోట్లకి అటూ ఇటూ గా కలెక్ట్ చేయవచ్చు. ఇక సౌత్ మోస్ట్ వాంటెడ్ మూవీస్ లో ఒకటైన KGF కన్నడ బుకింగ్స్ కుమ్మేస్తుండగా అక్కడ తొలిరోజు ఎంత వసూల్ చేస్తుందో చెప్పలేకపోతున్నారు. ఈజీగా 8 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టవచ్చు అంటున్నారు. తెలుగు లో మాత్రం 50 లక్షల రేంజ్ లో షేర్ అందుకునే చాన్స్ ఉంది.

ఇక మారి 2 తెలుగు లో బజ్ పెద్దగా లేదు కానీ పోటి లో వస్తున్న మాస్ ఎంటర్ టైనర్ ఇదే అవ్వడంతో అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమా 30 లక్షల లోపు షేర్ ని అందుకోవచ్చు. ఇక కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ జీరో టోటల్ ఇండియా లో 25 కోట్ల నుండి 30 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ పక్కా అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here