Home టోటల్ కలెక్షన్స్ చరిత్రకెక్కే యుఫోరియా…డిసాస్టర్ తో ఇండస్ట్రీ హిట్ కి 5 ఏళ్ళు…కబాలి బిజినెస్ అండ్ కలెక్షన్స్ ఇవే!

చరిత్రకెక్కే యుఫోరియా…డిసాస్టర్ తో ఇండస్ట్రీ హిట్ కి 5 ఏళ్ళు…కబాలి బిజినెస్ అండ్ కలెక్షన్స్ ఇవే!

4206
0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాహుబలి యుఫోరియా ఎలాంటిదో అందరికీ తెలిసిందే, కానీ బాహుబలి భారీ బడ్జెట్ తో ఊహకందని విజువల్స్ తో ఇండియా లోనే ఎపిక్ అనిపించే రేంజ్ లో తెరకెక్కిన సినిమా, కానీ ఒక నార్మల్ మూవీ తో బాహుబలి రేంజ్ లో భీభత్సం సృష్టించే క్రేజ్ ను సొంతం చేసుకున్న సినిమా సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన కబాలి సినిమా అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర 2016 టైం లో…

ఈ సినిమా యుఫోరియా నెక్స్ట్ లెవల్ లో ఉందని చెప్పొచ్చు… ఎక్కడ చూసిన కబాలి కబాలి అంటూ ప్రమోషన్స్, సినిమా రిలీజ్ టైం లో ఫ్లైట్స్ లో సినిమా పోస్టర్స్ ని పెట్టడం, కంపెనీలు ఈ సినిమా రిలీజ్ రోజును సెలవుగా ప్రకటించడం అబ్బో ఈ సినిమా యుఫోరియాను చూసి…

అన్ని ఇండస్ట్రీలు ఓ రేంజ్ లో షాక్ అయ్యాయి, అది కూడా కేవలం ఒక్క టీసర్ సృష్టించిన సునామీ వల్ల… సినిమా షూటింగ్ టైం లో కూడా పెద్దగా లేని హైప్ ఒక్క టీసర్ రిలీజ్ తర్వాత దేశం అంతా పాకింది. చిన్న పెద్ద అందరూ కబాలి డా, మంచిది అంటూ…

డైలాగ్స్ చెప్పడం సినిమా క్రేజ్ ని పదింతలు చేయగా సినిమా టీసర్ సృష్టించిన సునామీ తో సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేయకుండానే ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా అట్టర్ డిసాస్టర్ టాక్ ని మార్నింగ్ షో కే సొంతం చేసుకుంది. ఇంతటి హైప్ నడుమ వచ్చిన అట్టర్ డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ…

బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో 161 కోట్ల రేంజ్ లో షేర్ ని 290 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. సినిమా బిజినెస్ 160 కోట్ల రేంజ్ లో ఉన్నా ఆ బిజినెస్ ఆల్ మోస్ట్ రికవరీ చేసి కోలివుడ్ ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచింది. ఇండియాలో డిసాస్టర్ టాక్ తో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా ఇదేనని చెప్పొచ్చు. ఆ రేంజ్ యుఫోరియాని సొంతం చేసుకున్న కబాలి వచ్చి 5 ఏళ్ళు పూర్తీ అవ్వడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here