షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తీ చేసుకుని రిలీజ్ కి సిద్ధం అయిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ ను ఆన్ టైం కి సొంతం చేసుకోవాలని రూల్ ఏమి లేదు, కానీ అలా కాకుండా డిలే అవుతూ ఏళ్లకి ఏళ్ళు స్టూడియోలలోనే ఉన్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. కానీ కొందరు మంచి స్టార్ కాస్ట్ తో రూపొందిన సినిమాలు కూడా డిలే అవుతూ అలా అనేక అవరోధాలను ఎదురుకోవడం కూడా మనం చూస్తూనే ఉన్నామ్.
రీసెంట్ గా తమిళ్ లో రిలీజ్ అయిన ఎస్ జే సూర్య సెల్వరాఘవన్ ల కాంబినేషన్ లో రూపొందిన సినిమా నెంజం మరప్పదిల్లై సినిమా ఎప్పుడో 2016 లో మొదలు అయ్యి ఏడాది లోపే పూర్తీ అయ్యి ఇక రిలీజ్ అవుతుంది అంటూ అలా అలా అనేక ఫైనాన్స్ ఇబ్బందులను ఎదురుకుంటూ…
ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ రాగా ఎట్టకేలకు ఈ సినిమాను రీసెంట్ గా అన్ని అవరోధాలను అధిగమించి రిలీజ్ డేట్ ను ప్రకటించగా సడెన్ హైప్ ని పెంచేలా ఒక స్నీక్ పీక్ ఎస్ జే సూర్య సైకోయిజం చూపెట్టి మరింత బజ్ పెరిగేలా చేశారు, అయినా మళ్ళీ బాలెన్స్ ఉన్న…
ఫైనాన్స్ అప్పుల వలన రిలీజ్ ఆన్ టైం లో మళ్ళీ అవరోధాలు రాగా ఈ సారి కోలివుడ్ సినీ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి మ్యాటర్ సెటిల్ చేసి సినిమా ను రిలీజ్ అయ్యేలా చేశారు. ఇక ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఎలాగోలా రిలీజ్ అవ్వడం తో జనాలు వస్తారో రారో అన్న డౌట్ సినిమా టాక్ ఎలా ఉంటుందో అన్న డౌట్స్ ఉండగా సినిమా అందరినీ ఆశ్యర్య పరుస్తూ సూపర్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోగా…
ఆడియన్స్ విరగబడి థియేటర్స్ కి వస్తూ ఉండగా హౌస్ ఫుల్ బోర్డులతో తమిళనాడులో సినిమా దుమ్ము లేపుతుందట, మాస్టర్ తర్వాత సినిమా హాళ్ళలో హౌస్ ఫుల్ బోర్డులు ఈ సినిమాకే మళ్ళీ పడుతున్నాయని అంటున్నారు. ఇక సినిమా కలెక్షన్స్ పరంగా అక్కడ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది….