బాక్స్ అఫీస్ దగ్గర యూత్ సెన్సేషనల్ విజయ్ దేవరకొండ సెన్సేషనల్ లైగర్ తో సాలిడ్ బజ్ ను క్రియేట్ చేసినా కానీ ఆడియన్స్ మనసు గెలుచుకోలేదు. సినిమా హిందీలో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ అన్ని చోట్లా మాత్రం డిసాస్టర్ రేటింగ్ లను డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది సినిమా…
తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన నిరాశ పరిచిన ఈ సినిమా మిగిలిన చోట్ల మాత్రం పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధించగా మొత్తం మీద ఇప్పుడు మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓవరాల్ గా…
50 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది… ఇందులో తెలుగు రాష్ట్రాల నుండి మొత్తం మీద 21.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల ఆవల మొత్తం మీద మరో 30.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది.
దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా 4 రోజుల్లో ఇప్పుడు 50.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. మొత్తం మీద డిసాస్టర్ టాక్ తో కూడా సినిమా వీకెండ్ కంప్లీట్ అయ్యే టైం కి 50 కోట్ల మార్క్ ని అందుకోవడం విశేశం అయినా కానీ అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.