చస్….50 డేస్…150 సెంటర్స్…200 కోట్లు..ఏం సినిమా రా బాబు ఇది!

0
1059

ఇండియాలో బాలీవుడ్ తర్వాత అంత పెద్ద మార్కెట్ ఉన్న ఇండస్ట్రీ గా టాలీవుడ్ కోలివుడ్ ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతుండగా మధ్యలో అతి చిన్న మార్కెట్ ప్లేస్ గా చెప్పుకునే కేరళ లో కూడా కొన్ని సినిమాలు ఊహకందని కలెక్షన్స్ ని సాధిస్తున్నాయి. ప్రేమం అప్పట్లో 60 కోట్ల గ్రాస్ ని అందుకుని రికార్డ్ సృష్టించింది. కానీ తర్వాత సూపర్ స్టార్ మోహన్ లాల్ పులి మురుగన్ సినిమాతో ఏకంగా 150 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకున్నాడు.

ఇక ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన లూసిఫెర్ సినిమా ఆ రికార్డులను చెరిపేసి వరల్డ్ వైడ్ గా 50 రోజుల్లో ఏకంగా 200 కోట్ల గ్రాస్ ని అందుకుంది అంటూ అక్కడ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా 50 రోజులను ఏకంగా 150 సెంటర్స్ లో జరుపుకుంటూ రికార్డ్ సృష్టించిందట ఈ సినిమా.

మలయాళ సినిమాల్లో తొలి 100, 125, 150, 175 మరియు 200 కోట్ల గ్రాస్ మార్క్ లను అందుకున్న ఒకే ఒక్క హీరోగా సూపర్ స్టార్ మోహన్ లాల్ ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేశాడు. ఈ సినిమా కి త్వరలోనే సీక్వెల్ కూడా చేసే ఆలోచన లో ఉన్నట్లు తెలుస్తుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here