ఎస్ ఎస్ రాజమౌళి చేసే సినిమాలు ఒక్కోటి భారీ బడ్జెట్ తో భారీ విజువల్స్ తో తెరకెక్కుతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే, ఒక్కో సీన్ ని పెర్ఫెక్ట్ గా వచ్చేలా చెక్కే జక్కన్న సినిమాల షూటింగ్ టైం లో ఒక్క సీన్ ఓకే చేయాలి అంటే ఎక్కువ టైం తీసుకుంటారు, అందుకే ఎక్కువగా షూటింగ్ ల విషయం లో లాంగ్ షెడ్యూల్స్ పెద్దగా ఉండవు కానీ రీసెంట్ గా మాత్రం….
ఆర్ ఆర్ ఆర్ సినిమా కి గాను కరోనా పరిస్థితుల తర్వాత షూటింగ్ తిరిగి మొదలు అవ్వగా అప్పటికే వేసిన ఓ భారీ సెట్ లో ఏకంగా 50 రోజుల నైట్ షూటింగ్ ని నాన్ స్టాప్ గా జరిపి రీసెంట్ గా ముగించారు జక్కన్న, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల పై…
కీలక సన్నివేశాలను చిత్రీకరించగా అలాగే ఇద్దరి పై కూడా కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ ఎలివేషన్ సీన్స్ ని భారీ స్టార్ కాస్ట్ తో అన్ని ప్రికాషన్స్ తీసుకుని మరీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తీ చేశారట యూనిట్. కాగా ఈ 50 రోజుల షూటింగ్ కి అయిన…
బడ్జెట్ మాత్రం ఓ మీడియం రేంజ్ మూవీ ని షూట్ చేసే రేంజ్ లో అయ్యింది అని చెప్పాలి. ఏకంగా 35 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ 50 రోజుల షూటింగ్ జరిగింది అని టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇది మాములు విషయం కాదనే చెప్పాలి. ఇక ఇద్దరు హీరోలకు సంభందించిన కంప్లీట్ షూటింగ్ 2021 లో…
మార్చ్ ముగిసే టైం లో కంప్లీట్ అవుతుంది అని అంటున్నారు. ఇక ఆలియా భట్ షూటింగ్ పార్ట్ త్వరలోనే రెగ్యులర్ గా జరగబోతుండగా…. అజయ్ దేవగన్ పార్ట్ ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చింది అంటున్నారు. మొత్తం మీద సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఇయర్ దసరా రేసులో బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం..