పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ (AdiPurush) ఆడియన్స్ ముందుకు భారీ అంచనాలతో రాగా సినిమా రిలీజ్ అయిన తర్వాత విపరీతమైన ట్రోల్స్ ని ఫేస్ చేసిన విషయం తెలిసిందే….
ఆ ట్రోల్స్ ఇంపాక్ట్ వలన సినిమా మొదటి వీకెండ్ లో దుమ్ము దుమారం లేపే కలెక్షన్స్ ని సాధించినా కూడా తర్వాత మాత్రం విపరీతమైన డ్రాప్స్ ను సొంతం చేసుకుని ఇప్పుడు ఓవరాల్ గా భారీ నష్టాలనే సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తుందని చెప్పాలి ఇప్పుడు…
ఇక సినిమా బడ్జెట్ పరంగా చూసుకుంటే వచ్చిన కలెక్షన్స్ చాలా తక్కువే వచ్చాయి అని చెప్పాలి. ఇక సినిమా బడ్జెట్ రిలీజ్ కి ముందు 500 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో రూపొందింది అంటూ మేకర్స్ అండ్ టీం ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు… కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత…
రెస్పాన్స్ చూసి ఓవరాల్ గా సినిమా బడ్జెట్ పైన థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ తో బడ్జెట్ లో నష్టాలు కొద్ది వరకు వచ్చాయి అన్న టాక్ ఉండగా లేటెస్ట్ గా సినిమా హిందీ ఇంటర్వ్యూలలో టీం సినిమా బడ్జెట్ పై కొత్త లెక్కలు చెబుతున్నారాట…
సినిమా బడ్జెట్ మొత్తం మీద 400 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కింది అంటూ చెబుతున్నారు… థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ తో సినిమా మేకర్స్ కి డీసెంట్ ప్రాఫిట్స్ ని తెచ్చి పెట్టింది అంటున్నారు. సినిమా గ్రాఫిక్స్ చూసి చాలా మంది ముందు చెప్పిన బడ్జెట్ పెట్టి సినిమా తీసి ఉంటే క్వాలిటీ పరంగా ఇలాంటి ట్రోల్స్ ని ఫేస్ చేయకుండా ఉండేదని కామెంట్స్ చేస్తున్నారు….