బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆది పురుష్(Adi Purush) ఇండియాలో ఎలాగూ భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఓవర్సీస్ లో మాత్రం హాలీవుడ్ లేటెస్ట్ మూవీస్ ఇంపాక్ట్ వలన అనుకున్న రేంజ్ లో..
షోలు దక్కలేదు… దాంతో బుకింగ్స్ పై ఆ ఇంపాక్ట్ పడగా అడ్వాన్స్ టికెట్ సేల్స్ మనీ చాలా తక్కువగా ఉండగా రోజులు దగ్గర పడుతున్న కొద్ది ఇప్పుడు మేకర్స్ ఎలాగోలా షోలను పెంచుతూ ఉండగా మొత్తం మీద సినిమా 305 లోకేషన్స్ లో ఓపెన్ అవ్వగా ఇప్పుటి వరకు అక్కడా…
810 వరకు షోల బుకింగ్స్ ఓపెన్ అవ్వగా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ సేల్స్ తో సినిమా హాల్ఫ్ మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది. ఇక రిలీజ్ కి ఇంకా టైం ఉన్న కారణంగా ఇంకా ఈ గ్రాస్ పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా ఈ రిలీజ్ ఇతర పాన్ ఇండియా…
మూవీస్ తో పోల్చితే మరీ సెన్సేషనల్ అని చెప్పలేం కాని ఒక స్టార్ హీరో సినిమా రేంజ్ లోనే ఇప్పుడు అక్కడ సినిమాకి షోలు లోకేషన్స్ లో రిలీజ్ సొంతం అవుతుంది. ఇక రిలీజ్ టైంకి ఇంకా లోకేషన్స్ అండ్ షోలు యాడ్ అయ్యే అవకాశం ఉండగా ఇప్పుడు సినిమా అక్కడ…
ప్రీమియర్స్ ద్వారా 1 మిలియన్ కి అటూ ఇటూగా గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. బజ్ అండ్ టాక్ బాగుంటే లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. మొత్తం మీద సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఓపెనింగ్స్ పరంగా జోరు చూపించే అవకాశం ఉందని చెప్పాలి.