Home న్యూస్ 50 కోట్ల మాస్ జాతర…..బాలయ్య మాస్ భీభత్సం ఇది!!

50 కోట్ల మాస్ జాతర…..బాలయ్య మాస్ భీభత్సం ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హిట్స్ తో యమ జోరు మీద ఉన్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) భారీ అంచనాల నడుమ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా… సినిమా ఓపెనింగ్స్ పరంగా అన్ని చోట్లా….

కుమ్మేస్తూ మొదటి రోజు అంచనాలను మించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…మొదటి రోజు నైట్ షోలకు రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోయిన సినిమా ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య కెరీర్ లో సెకెండ్ హైయెస్ట్ లేదా…

Daaku Maharaaj Movie WW Pre Release Business...NO1 Record For Balayya!!

అన్నీ అనుకున్నట్లు జరిగితే కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను నమోదు చేసే అవకాశం కొద్ది వరకు ఉంది. మొత్తం మీద మొదటి రోజు తెలుగు రాష్ట్రాల గ్రాస్ ఓపెనింగ్స్ 33-35 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది…

ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవరాల్ గా 3.5-4 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది…లిమిటెడ్ రిలీజ్ తోనే సినిమా ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించగా ఓవర్సీస్ లో 1 మిలియన్ కి పైగా గ్రాస్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండటం తో ఇప్పుడు…

మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 46-48 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉండగా…ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు, మాస్ సెంటర్స్ లో మాస్ జోరు అనుకున్న రేంజ్ లో ఉంటే 50 కోట్ల భీభత్సం సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది… ఇక అఫీషియల్ ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here