ఒక నిర్మించడం ఎంత కష్టమో…ఆ సినిమా బిజినెస్ చేయడం కూడా అంత కష్టమే… కొన్ని సినిమాలకి సింపుల్ గా క్రేజ్ ను బట్టి బిజినెస్ జరుగుతుంది కానీ బడ్జెట్ ఎక్కువ అయిన సినిమాలకు బిజినెస్ అదే రేంజ్ లో జరగాలి అని కోరుకుంటారు నిర్మాతలు, అలాంటి ఆఫర్స్ రాక పొతే చేసేదేమీ లేక తక్కువ రేట్లకే సినిమాను అమ్ముతూ ఉంటారు. లేటెస్ట్ గా బడ్జెట్ ఎక్కువ అయ్యి బిజినెస్ ఆఫర్స్ ఆశించిన మేర లేక…
బిజినెస్ ఆఫర్స్ కోసం ఎదురు చూసి చూసి ఎం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడు మంచు విష్ణు. తన కెరీర్ లో ఇప్పటి వరకు ఏ సినిమా కి కూడా పెట్టనంత రేంజ్ లో ఏకంగా 50 కోట్ల బడ్జెట్ తో రూపొందిన లేటెస్ట్ మూవీ మోసగాళ్ళు. కాజల్ అగర్వాల్ కీలక పాత్ర పోషిస్తున్న…
ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో రూపొందిన సినిమా కానీ మంచు విష్ణు లేటెస్ట్ మూవీస్ అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ నే సొంతం చేసుకుంటూ ఉండటం తో ఈ సినిమా కి అసలు బిజినెస్ జరగడం లేదట. నిర్మాతలు అడుగుతున్న రేట్లు….
బయ్యర్లు చెబుతున్న రేట్లు అస్సలు సెట్ కాక పోవడం తో ఇక ఎం చేయాలో తెలియని స్థితి లో ఇప్పుడు తానె రంగం లోకి దిగి సినిమా ను అన్ని చోట్లా ఓన్ రిలీజ్ చేయలాని డిసైడ్ అయ్యాడు మంచు విష్ణు. అది తెలుగు రాష్ట్రాల వరకు మాత్రమే పరిమితం అవ్వకుండా ఏకంగా పాన్ ఇండియా లెవల్ లో…తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ మరియు మలయాళంలో…
సినిమాను తానె స్వయంగా లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ తో కలిసి ఓన్ గా రిలీజ్ చేస్తున్నారట. ఇక సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. 50 కోట్లు పెట్టినా వరుస ఫ్లాఫ్స్ ఎఫెక్ట్ తో సినిమాను ఎవ్వరూ కొనడానికి ముందుకు రాక పోవడంతో ఓన్ రిలీజ్ గా వస్తున్న మోసగాళ్ళు ఎంతవరకు అంచనాలను అందుకుని ఈ బడ్జెట్ ను రికవరీ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారింది.