బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) మూవీ భారీ అంచనాల నడుమ వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా దుమ్ము దుమారం లేపినా కూడా తర్వాత మాత్రం విపరీతమైన ట్రోల్స్ వలన…
బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో డౌన్ అయింది సినిమా… సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇతర భాషల్లో పరుగును ముగించుకోగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆల్ మోస్ట్ పరుగు పూర్తీ అవ్వగా సినిమా నైజాం ఏరియాలో పరుగు పూర్తీ అవ్వగా ఇక్కడ…
మొత్తం మీద 50 కోట్ల రేంజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా టోటల్ గా 60 కోట్ల రేటు ఇచ్చినా 10 కోట్లు రిఫండబుల్ అవ్వడంతో అవి లెక్కలోకి తీసుకోకుండా 50 కోట్ల బిజినెస్ నే తీసుకుంటే అందులో నుండి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 36.90 కోట్ల షేర్ ని అందుకోగా….
అప్ డేట్ అయిన GST రిటర్న్స్ అన్నీ కలిపుకుని… టోటల్ రన్ లో 38.40 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పరుగును పూర్తీ చేసుకుంది సినిమా… దాంతో టోటల్ గా 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ లో సినిమా టోటల్ గా 11.6 కోట్ల దాకా లాస్ ను సొంతం చేసుకుంది…
సినిమా కి మొదటి వీకెండ్ లోనే ఆల్ మోస్ట్ 30 కోట్ల లోపు షేర్ ని అందుకోగా తర్వాత టాక్ ఇంపాక్ట్ వలన మిగిలిన రన్ లో 8.40 కోట్ల దాకా రికవరీని మాత్రమే సొంతం చేసుకుంది. ఓవరాల్ గా నైజాంలో సినిమా సాధించిన నష్టాలు ప్రభాస్ అప్ కమింగ్ సలార్(Salaar) లాభాలను తెప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.