బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి సినిమా బాలయ్య కెరీర్ లో ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను ఇప్పుడు నమోదు చేసింది, ఈ రేంజ్ లో ఊచకోత కొస్తుంది అని ఎవ్వరూ అంచనా వేయలేదు, బాలయ్య కెరీర్ లో ఇప్పటి వరకు ఏ సినిమా మొదటి రోజు 30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని అందుకోలేదు, కానీ….
వీర సింహా రెడ్డి ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ చూసి పక్కా 40 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకోవడం ఖాయమని అందరూ అనుకున్నారు, కానీ సినిమా నైట్ షోలకు విపరీతమైన ఓవర్ ఫ్లోని సొంతం చేసుకుని అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించిపోయింది.
ఏకంగా 45 కోట్ల మార్క్ ని దాటేసి ఆ పైన ఏకంగా 50 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని బాలయ్య కెరీర్ లో ఆల్ టైం ఎపిక్ బెంచ్ మార్క్ ని నమోదు చేసి ఊచకోత కోసింది ఈ సినిమా. మొదటి రోజు 50 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.
బాక్ టు బాక్ డిసాస్టర్స్ తర్వాత అఖండతో సాలిడ్ కంబ్యాక్ ని సొంతం చేసుకుని ఇప్పుడు వీర సింహా రెడ్డి సినిమా తో ఊహకందని ఓపెనింగ్స్ ని అందుకుని కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రికార్డులను తిరగరాసిన వీర సింహా రెడ్డి సినిమా పండగ వీకెండ్ లో ఓవరాల్ గా ఇప్పుడు ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది ఇప్పుడు.