బాక్స్ ఆఫీస్ దగ్గర 9 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 203.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన సలార్(salaar part 1 – ceasefire) వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 524 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని సాలిడ్ గా దూసుకు పోతుంది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 4.5 కోట్ల రేంజ్ నుండి 4.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా సినిమా హిందీలో ఈ రోజు 10 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.
ఇక సినిమా మిగిలిన అన్ని చోట్లా ఓవరాల్ గా 5-6 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద 10వ రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 21 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఈ కలెక్షన్స్ తో సినిమా ఓవరాల్ గా…
ఇప్పుడు 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా 208 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేయబోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 545 కోట్లకి అటూ ఇటూగా గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక టోటల్ గా 10 రోజుల్లో సినిమా సాధించే టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.