ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో రికార్డుల జాతర సృష్టిస్తూ దూసుకు పోతున్న విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఛావా సినిమా అన్ని చోట్లా హిస్టారికల్ కలెక్షన్స్ తో బాలీవుడ్ లో సైతం హిస్టారికల్ మూవీస్ లో ఎపిక్ రికార్డులను నమోదు చేస్తూ ఉండగా సినిమా 12 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర…
వరల్డ్ వైడ్ గా ఏకంగా 500 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని దాటేసి 515 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక సినిమా 13 వ రోజున సాధించిన కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా 550 కోట్ల మార్క్ ని దాటేసి దుమ్ము దుమారం లేపగా…
ఇప్పుడు ఈ సినిమా తెలుగు లో గ్రాండ్ గా డబ్ అయ్యి రిలీజ్ కాబోతుంది. సినిమా రిలీజ్ రోజునే ఈ సినిమాను తెలుగు లో డబ్ చేసి ఉంటే కలెక్షన్స్ ఓ రేంజ్ లో వచ్చేవని అందరూ అనుకోగా, మేకర్స్ ఏం స్పందించక పోవడంతో చాలా మంది సినిమా హిందీ వర్షన్ నే…
ఎగబడి చూడటం మొదలు పెట్టగా మేజర్ సెంటర్స్ లో ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీతో రన్ అయిన అయిన సినిమాను ఇప్పుడు అఫీషియల్ గా మార్చ్ 7న గ్రాండ్ గా డబ్ చేసి తెలుగు లో రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. తెలుగు రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకి గీతా ఆర్ట్స్ వాళ్ళు సొంతం చేసుకోగా…
7న పెద్దగా పోటి ఏమి లేక పోవడంతో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ సినిమాను అప్పటికి ఇంకా ఎక్కువ మంది చూసి ఉంటారు కాబట్టి డబ్ వర్షన్ కొంచం ఎక్కువ డిలే అవుతున్నట్లు అనిపిస్తున్నా తెలుగులో చూడాలి అనుకున్న వాళ్ళు కచ్చితంగా మరోసారి చూసే అవకాశం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి.