టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ భీమ్లా నాయక్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా ఆ అంచనాలకు తగ్గట్లు గానే వరల్డ్ వైడ్ గా భారీగా రిలీజ్ అయిన ఈ సినిమా కి ఆంధ్రలో లో టికెట్ రేట్స్ వలన ఇబ్బందులు ఎదురు అవ్వడం, లో టికెట్ రేట్స్ వలన కొన్ని చోట్ల థియేటర్స్ క్లోజ్ అవ్వడం…..
జరగడం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పై గట్టి ఇంపాక్ట్ నే క్రియేట్ చేసింది అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు నైజాం ఏరియాలో మొదటి రోజు 15-16 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఫైనల్ లెక్కలు బాగుంటే….
ఈ లెక్క ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఆంధ్ర రీజన్ లో ఎఫెక్ట్ ఉన్నా కానీ టోటల్ ఆంధ్ర ప్రదేశ్ ఏరియాలో సినిమా ఇప్పుడు 20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా సినిమా ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఇప్పుడు…
36 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం మించిపోయే అవకాశం ఉందని చెప్పాలి. ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి టోటల్ గా ఇండియా లో 42-43 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ మొత్తం మీద సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు మొదటి రోజు 53 కోట్ల నుండి 55 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని….
సొంతం చేసుకోవచ్చు… ఓవరాల్ గా మొదటి రోజు అడ్డంకులు ఎదురు అయినా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోసింది అని చెప్పాలి. మొత్తం మీద సినిమా ఇప్పుడు మొదటి రోజు ఈ కలెక్షన్స్ ని ఇదే రేంజ్ లో అందుకుంటుందా లేక ఈ కలెక్షన్స్ ని కూడా మించి పోయి ముందుకు వెళుతుందో చూడాలి. ఇక అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.