చాలా కాలంగా హిట్ కి దూరంగా ఉన్న హీరో మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ జిన్నా ఆడియన్స్ ముందుకు ఫస్ట్ దసరా బరిలోకి దింపాలి అనుకున్నా తర్వాత దీపావళికి పోస్ట్ పోన్ చేయగా ఈ సారి కూడా పోటిలోనే రిలీజ్ చేయాల్సి రాగా ఆ పోటి వలన సినిమా కి తెలుగు రాష్ట్రాల్లో మినిమమ్ ఓపెనింగ్స్ కూడా లభించక పోవడం విచారకరం, మొత్తం మీద 12 లక్షల రేంజ్ లోనే షేర్ ని…
సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు సొంతం చేసుకోగా ఓవర్సీస్ లో సినిమా ప్రీమియర్స్ ని మిగిలిన సినిమాలతో వేయకుండా ఒక రోజు ఆలస్యంగా వేయాలని టీం డిసైడ్ అయ్యారు, ఆ నిర్ణయం కలిసి వస్తుందేమో అనుకున్నారు కానీ…
అలాంటిదేమీ జరగలేదు, ఓవర్సీస్ లో ఒకరోజు ఆలస్యంగా సినిమా ప్రీమియర్స్ పడగా సినిమా అక్కడ 21 లోకేషన్స్ లో కేవలం $566 డాలర్స్ అంటే ఇండియన్ కరెన్సీ లో కేవలం 47 వేల గ్రాస్ ను మాత్రమే సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది….
ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా ఓపెనింగ్స్ దారుణంగా ఉండటంతో సినిమా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకోవడం కష్టంగానే కనిపిస్తుంది. కానీ సినిమా కి కొంచం పర్వాలేదు అనిపించే టాక్ ఉండటంతో ఏమైనా గ్రోత్ ని అప్ కమింగ్ డేస్ లో చూపిస్తుందో చూడాలి.