Home న్యూస్ 5 కోట్లు దాటిన ఖలేజా భీభత్సం…మహేష్ మాస్ తాండవం!!

5 కోట్లు దాటిన ఖలేజా భీభత్సం…మహేష్ మాస్ తాండవం!!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కెరీర్ లో చాలా స్పెషల్ సినిమా అయిన ఖలేజా(Khaleja4K Re Release) సినిమావరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్ లో రీ రిలీజ్ కాబోతూ ఉండగా సినిమాకి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ మాస్ రాంపెజ్ ను సృష్టించింది అని చెప్పాలి. ఓవరాల్ గా బుక్ మై షో లో ఇప్పటి వరకు…

జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ లెక్క 170K టికెట్ సేల్స్ ను అందుకుని సంచలనం సృష్టించింది. ఒక వీకెండ్ కి గాను ఒక్క హైదరాబాదులోనే ఆల్ మోస్ట్ 2.7 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను అందుకుంది.

ఇక ఇండియా వైడ్ గా 4.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా ఓవర్సీస్ లో కూడా కుమ్మేస్తుంది… నార్త్ అమెరికాలో ఆల్ మోస్ట్ 50 వేలకి దగ్గర అయ్యే రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా ఆస్ట్రేలియాలో 11 వేల రేంజ్ డాలర్స్ మార్క్ ని అందుకుంది…

టోటల్ వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో సినిమా 5 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది. అందులో ప్రీమియర్స్ అండ్ మొదటి రోజుకి గాను ఆల్ మోస్ట్ 4 కోట్లకు చేరువ అయ్యే రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా…

ఓవరాల్ గా ఇప్పుడు టాలీవుడ్ రీ రిలీజ్ లలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఓవర్సీస్ లో ఇదే స్పీడ్ ను మెయిన్ టైన్ చేస్తే అక్కడ కొత్త రికార్డులు మొదటి రోజు నుండే సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా కొత్త సినిమాలకు ధీటుగా ఖలేజా బాక్స్ అఫీస్ దగ్గర ఓపెన్ కాబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here