Home టోటల్ కలెక్షన్స్ 5 కోట్ల రేటుకి నో అన్నారు…ఇప్పుడు టోటల్ గా వచ్చింది ఇది!!

5 కోట్ల రేటుకి నో అన్నారు…ఇప్పుడు టోటల్ గా వచ్చింది ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి రేసులో నిలిచిన సినిమాలలో అసలు ఎవ్వరూ పట్టించుకోని సినిమా మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన రెండో సినిమా సూపర్ మచ్చి…. విజేత సినిమా తో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ ఆ సినిమాతో నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోగా రెండో మూవీ గా సూపర్ మచ్చిని మొదలు పెట్టగా ఎప్పుడో షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న…

   

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కి నోచుకోలేక పోయింది. ఎప్పటికప్పుడు ఎదో ఒక కారణంతో సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ రాగా సినిమాకి ఏడాదిన్నర నుండి డిజిటల్ లో డైరెక్ట్ రిలీజ్ కోసం ఆఫర్స్ బాగానే సొంతం అయ్యాయి అని చెప్పాలి…

ఆల్ మోస్ట్ 4.5 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ లో డిజిటల్ రిలీజ్ ఆఫర్స్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది అంటూ ట్రేడ్ లో వార్తలు వచ్చినా సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యి ఈ సంక్రాంతి కి సినిమాను రిలీజ్ చేయగా మెగా హీరోలు ఎవ్వరూ ప్రమోట్ చేయక పోవడం, సినిమా కూడా ఓల్డ్ అయిపోవడంతో…

అసలు జనాలు పెద్దగా ఈ సినిమాను పట్టించుకోలేదు అని చెప్పాలి…. దాంతో సినిమా కలెక్షన్స్ పరంగా తొలిరోజే డెఫిసిట్ ల తో ఓపెన్ అవ్వగా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాలలో 21 లక్షల దాకా షేర్ ని వరల్డ్ వైడ్ గా 23 లక్షల దాకా షేర్ ని 40 లక్షల దాకా గ్రాస్ ను సొంతం చేసుకుంది. అది కూడా నెగటివ్ షేర్ డెఫిసిట్ లు తీయకుండా….

చెబుతున్న కలెక్షన్స్ కాగా అవి కూడా తీసేస్తే సినిమాకి మిగిలేది ఇంకా ఏమి ఉండదు అనే చెప్పాలి. బిజినెస్ వాల్యూ 2 కోట్ల వరకు ఉంటుందని రీసెంట్ గా తెలియగా ఆ రేటు ప్రకారం చూసుకున్నా ఏ మాత్రం దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేక పోయింది ఈ సినిమా… ముందు వచ్చిన OTT ఆఫర్ ని ఓకే చేసి ఉన్నా బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేది సినిమా కి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here