యాంకర్ నుండి హీరోగా మారి మొదటి సినిమాతో సక్సెస్ అందుకున్న ప్రదీప్ మాచిరాజు(pradeep machiraju) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి(Akkada Ammayi Ikkada Abbayi Movie) సినిమా కూడా డీసెంట్ రివ్యూలను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం పెద్దగా…
ఇంపాక్ట్ ని ఏమి చూపించ లేక పోయింది…వీకెండ్ లో పెద్దగా జోరు చూపించ లేక పోయిన సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా కంప్లీట్ గా ఇప్పుడు చేతులు ఎత్తేసినట్లు అయింది అని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద 4 రోజులు పూర్తి అయ్యే టైంకి..
2.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 1.05 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా 5వ రోజున ఫుల్ వర్కింగ్ డే లో డ్రాప్ అయ్యి 20 లక్షల రేంజ్ లో గ్రాస్ ను తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా వరల్డ్ వైడ్ గా 22 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుంది. షేర్ అటూ ఇటూగా…
10 లక్షల రేంజ్ లో సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద 6 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రలలో 2.20 కోట్ల గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ 2.47 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా షేర్ 1.15 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు.
దాంతో మొత్తం మీద 4 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 2.85 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.