Home న్యూస్ ఛావా 5 డేస్ కలెక్షన్స్…రికార్డుల భీభత్సం సృష్టిస్తున్న విక్కీ కౌశల్!!

ఛావా 5 డేస్ కలెక్షన్స్…రికార్డుల భీభత్సం సృష్టిస్తున్న విక్కీ కౌశల్!!

0

సెన్సేషనల్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ లో హిస్టారికల్ జానర్ లో రిమార్కబుల్ జోరుని చూపెడుతున్న విక్కీ కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ ఛావా….చత్రపతి శంభాజీ మహారాజ్ గురించి తెలుసుకోని ఈ తరం ఆడియన్స్ ను ఎగబడి థియేటర్స్ కి రప్పిస్తూ ఉండగా, మహారాష్ట్రలో సినిమా హోల్డ్ లెవల్ అయితే మరో రేంజ్ లో దుమ్ము లేపుతుంది…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయినా కూడా ఊహకందని రేంజ్ లో హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి…4వ రోజున మండే అయినా ఎక్స్ లెంట్ హోల్డ్ తో 24 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా…

5వ రోజున మరో వర్కింగ్ డే లో అన్ని చోట్లా రిమార్కబుల్ హోల్డ్ ని చూపించి కుమ్మేసింది….చాలా లిమిటెడ్ డ్రాప్స్ ను మాత్రమే సొంతం చేసుకున్న సినిమా 25 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని సెన్సేషనల్ హోల్డ్ ని చూపించగా…

ఓవరాల్ గా సినిమా 5 రోజులు పూర్తి అయ్యే టైంకి సినిమా ఇండియాలో 171 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించింది. సినిమా ఒక్క మహారాష్ట్ర లోనే మరోసారి 5వ రోజున 15 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని ఇక్కడ ఊహకందని ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా..

సినిమా ఓవరాల్ గా మహారాష్ట్రలోనే 5 రోజుల్లో 76 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని దాటేసి మాస్ భీభత్సం సృష్టిస్తుంది. బాలీవుడ్ లో హిస్టారికల్ జానర్ లో ఎపిక్ రికార్డులను నమోదు చేస్తున్న ఈ సినిమా ఇక లాంగ్ రన్ లో ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here