బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోగా లిమిటెడ్ రిలీజ్ లో డీసెంట్ కలెక్షన్స్ పరుగును స్టడీగానే కొనసాగించింది కానీ ఓవరాల్ గా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా మాత్రం సినిమా ఇంకా బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఉండాల్సింది అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగగ్ర సినిమా…
5వ రోజు సండే అడ్వాంటేజ్ తో జోరు చూపుతుంది అనుకున్నా వర్షాల ఇంపాక్ట్ వలన కొన్ని చోట్ల కలెక్షన్స్ ని గండి పడి మొత్తం మీద సినిమా 4వ రోజు కన్నా కూడా తక్కువ వసూళ్ళనే సాధించింది. సినిమా మొత్తం మీద 5.5 కోట్ల నుండి…
6 కోట్ల దాకా వెళుతుంది అనుకున్నా కానీ మొత్తం మీద 5వ రోజు 5.23 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమే సినిమా సొంతం చేసుకుంది ఇప్పుడు. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సినిమా 7.68 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది సినిమా… దాంతో సినిమా ఇప్పుడు…
బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజుల ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 10.93Cr
👉Ceeded: 8.31Cr
👉UA: 4.93Cr
👉East: 3.25Cr
👉West: 1.88Cr
👉Guntur: 3.59Cr
👉Krishna: 2.31Cr
👉Nellore: 1.76Cr
AP-TG Total:- 36.96CR(61.20CR~ Gross)
👉KA – 4.25Cr
👉Hindi+ROI – 4.10Cr(Corrected)
👉OS – 4.40Cr
Total World Wide – 49.71CR(90.65CR~ Gross)
ఇదీ సినిమా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్…
ఓవరాల్ గా సినిమా బిజినెస్ వాల్యూ 91 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 92 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 5 రోజులు కంప్లీట్ అయిన తర్వాత సినిమా ఇంకా 42.29 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా వర్కింగ్ డేస్ లో ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.