బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ వీకెండ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో రికార్డులు సృష్టించే అవకాశం ఉన్నప్పటికీ కూడా మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్న ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్(Double iSmart Movie) వీకెండ్ లో ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేకపోయింది.
ఇక సినిమా 5వ రోజు మరో హాలిడే అడ్వాంటేజ్ లభించినా కూడా ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేకపోయిన సినిమా మరింతగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది…హాలిడే రోజునే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక సినిమా వర్కింగ్ డేస్ పరిస్థితి మరింత కష్టంగా ఉండే అవకాశం ఉంది.
ఇక మొత్తం మీద 4వ రోజుతో పోల్చితే 5వ రోజు 50% కి పైగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 36 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 95 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది.
దాంతో టోటల్ గా 5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Double iSmart Movie 5 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 3.81Cr~
👉Ceeded: 1.38Cr
👉UA: 1.12Cr
👉East: 71L
👉West: 40L
👉Guntur: 94L
👉Krishna: 58L
👉Nellore: 33L
AP-TG Total:- 9.27CR(14.20CR~ Gross)
👉Ka+ROI: 95L
👉OS: 75L
Total WW Collections:- 10.97CR(17.85CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 49 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన డబుల్ ఇస్మార్ట్ 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 38.03 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉండగా 5వ రోజు పండగ హాలిడేలో దిమ్మతిరిగిపోయే డ్రాప్స్ ను సాధించిన సినిమా ఇక మిగిలిన రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.