గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆల్ మోస్ట్ 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ సినిమా భారీ లెవల్ లో సంక్రాంతికి రిలీజ్ అవ్వగా సినిమా కి మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ రావడం, సోషల్ మీడియా మొత్తం ఆ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో ఏ దశలో కూడా సినిమా బాక్స్ అఫీస్ దగ్గర న్యాయం చేయలేక పోతుంది. సంక్రాంతి సెలవుల్లో పెద్దగా ఇంపాక్ట్ ఏమి…
చూపించ లేక పోతున్న సినిమా తర్వాత రన్ ఎలా ఉంటుందో చూడాలి…ఇక సినిమా సౌత్ లో ఎలా ఉన్నప్పటికీ హిందీ లో కొన్ని కాంట్రవర్సీలు జరిగినప్పటికీ అక్కడ ఇక్కడ తో పోల్చితే బెటర్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది… కానీ సినిమా ఓపెనింగ్స్ ఆల్ మోస్ట్ ఎన్టీఆర్ దేవర రేంజ్ లో ఉన్నప్పటికీ…
అక్కడ బెటర్ కూడా సినిమాకి వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా అక్కడ పెద్దగా గ్రోత్ ఏమి చూపించ లేక పోతుంది సినిమా…4 రోజుల్లో హిందీ లో 29 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా 5వ రోజు సంక్రాంతి హాలిడే అడ్వాంటేజ్ లభించినా కూడా ఓవరాల్ గా 3 కోట్ల రేంజ్ లోనే…
నెట్ కలెక్షన్స్ ని అందుకోగా ఓవరాల్ గా 5 రోజుల్లో హిందీ లో 32 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంది…అదే టైంలో దేవర మూవీ 5 రోజులలో 38.72 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. సినిమాకి హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో ఓవరాల్ గా షేర్ 15 కోట్లకు పైగా ఉండగా హిందీ లో సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ లో 42.50 కోట్ల దాకా ఉండగా…
సినిమా ఇంకా చాలా దూరం అక్కడ రన్ ను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది…మొదటి రెండు మూడు రోజుల్లో సినిమా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ ని చూపించడంతో హిందీ లో లాంగ్ రన్ లో సినిమా హిట్ గీతని దాటుతుంది అనిపించింది కానీ…
ఓవరాల్ గా ఇప్పుడు పండగ సెలవుల్లో కూడా అక్కడ పెద్దగా గ్రోత్ ఏమి చూపించ లేక పోతూ ఉండటంతో అక్కడ తేరుకోవడం కూడా కష్టంగానే కనిపిస్తుంది. కానీ ఇంకా లాంగ్ వీక్ ఉంది కాబట్టి ఏమైనా హోల్డ్ చేసి కలెక్షన్స్ పరంగా బెటర్ హోల్డ్ ఏమైనా చూపించగలుగుతుందో లేదో చూడాలి ఇప్పుడు.