వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన జింఖానా(Gymkhana Telugu Movie) తెలుగులో వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి కొంచం పర్వాలేదు అనిపించే రేంజ్ లో ట్రెండ్ ను చూపెడుతున్నా కూడా జనాలు అయితే మరీ అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి వర్కింగ్ డేస్ లో రావడం లేదు అని చెప్పాలి….
సినిమా వీకెండ్ లో ఉన్నంతలో మంచి జోరు చూపించిన తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా 4వ 40 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 5వ రోజున లిమిటెడ్ డ్రాప్స్ నే అందుకుని 35 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది ఇప్పుడు…
ఇక సినిమా 18 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకున్న సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉండగా ఈ వీక్ లో చాలానే సినిమాలు రిలీజ్ అవుతూ ఉండటంతో ఎలాంటి హోల్డ్ ని చూపెడుతుందో చూడాలి ఇప్పుడు.
ఇక సినిమా 5 రోజుల్లో తెలుగులో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Alappuzha Gymkhana Movie Telugu 5 Days Collections Report
👉Nizam: 1.05Cr~
👉Total AP: 1.13Cr~
AP-TG Total:- 2.18CR(4.30Cr~ Gross)
ఇదీ ఓవరాల్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్కలు…
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగులో 3.25 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా క్లీన్ హిట్ కోసం మరో కోటి కి పైగా షేర్ ని సాధించాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇప్పుడు.