బాక్స్ ఆఫీస్ దగ్గర మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ జిన్నా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా దీపావళి హాలిడేస్ లో సినిమా అనుకున్న రేంజ్ లో అయితే పెర్ఫార్మ్ చేయలేక పోయింది. ఏ దశలో కూడా జనాలను థియేటర్స్ కి రప్పించ లేక పోయిన ఈ సినిమా 4వ రోజు తో పోల్చితే బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజు కొంచం తక్కువ డ్రాప్స్ నే సొంతం చేసుకుంది.
మిగిలిన సినిమాలు 50-60% రేంజ్ లో డ్రాప్ అవ్వగా జిన్నా సినిమా మాత్రం మొత్తం మీద 35% రేంజ్ లో డ్రాప్ అయ్యి 7 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది, కానీ టార్గెట్ ని అందుకోవడానికి ఇవి సరిపోవు అని చెప్పాలి.
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 5 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి 48 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 90 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా…
53 లక్షల రేంజ్ లో షేర్ ని కోటి రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా సినిమా 4 కోట్ల రేంజ్ లో అయినా కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 3.47 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.