బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక చోట హిట్ అయిన సినిమా మరో చోట కూడా హిట్ అవ్వాలని రూల్ ఏమి లేదు కానీ ఎంతో కొంత బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తుందని అయితే అందరూ ఎక్స్ పెర్ట్ చేస్తారు. కానీ తమిళ్ లో ఈ ఇయర్ సంక్రాంతికి భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విశాల్(Vishal) నటించిన ఓల్డ్ మూవీ మద గజ రాజ(Madha Gaja Raja) మూవీ…
ఎప్పుడో 12 ఏళ్ల క్రితం రిలీజ్ అవ్వాల్సిన సినిమా కాగా చాలా లేట్ గా రిలీజ్ అయ్యి ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆల్ మోస్ట్ 55 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచి…
విశాల్ కెరీర్ లో సెకెండ్ హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా నిలిచింది. ఇక సినిమాని తెలుగు లో అదే పేరుతో డబ్ చేసి రిలీజ్ చేయగా ఇక్కడ కూడా ఎంతో కొంత బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తుంది అనుకున్నా కూడా ఇక్కడ సినిమా కి మాస్ సెంటర్స్ లో..
పర్వాలేదు అనిపించేలా రెస్పాన్స్ వచ్చినా కూడా కలెక్షన్స్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ ని ఏమి క్రియేట్ చేయలేక పోయింది. వీకెండ్ లో ఓవరాల్ గా 1.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా స్లో డౌన్ అయిన సినిమా…
ఓవరాల్ గా మరో 30 లక్షల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకోగా ఇప్పటి వరకు సినిమా 1.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 65 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా డీసెంట్ హిట్ కోసం సినిమా 2.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా….
క్లీన్ హిట్ కోసం ఇంకా జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా తెలుగు లోకి వచ్చే సరికి మాత్రం డిసాస్టర్ రిజల్ట్ నే సొంతం చేసుకుంది. కానీ 12 ఏళ్ల క్రితం మూవీ ఓవరాల్ గా ఎక్స్ లెంట్ రిజల్ట్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి.