Home న్యూస్ 5 డేస్ రెట్రో టోటల్ కలెక్షన్స్…ఇది సరిపోదు…ఇంకా జోరు పెంచాల్సిందే!!

5 డేస్ రెట్రో టోటల్ కలెక్షన్స్…ఇది సరిపోదు…ఇంకా జోరు పెంచాల్సిందే!!

0

మంచి అంచనాల నడుమ రిలీజ్ అయినా కూడా మొదటి రోజే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో కలెక్షన్స్ పరంగా అనుకున్న రేంజ్ లో జోరుని చూపించ లేక పోతున్న సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో(Retro Movie)సినిమా వీకెండ్ ని పూర్తి చేసుకుని వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా…ఉన్నంతలో తమిళనాడులో…

సినిమా కొంచం పర్వాలేదు అనిపించగా ఓవర్సీస్ లో కూడా ఓకే అనిపించే రేంజ్ లో వసూళ్ళని అందుకోగా మిగిలిన చోట్ల స్లో డౌన్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా 5వ రోజు వర్కింగ్ డే లో 22 లక్షల రేంజ్ లో షేర్ ని 50 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా…

టోటల్ గా 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
RETRO Movie 5 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 1.26Cr~
👉Ceeded: 41L~
👉Andhra: 1.50Cr~
AP-TG Total:- 3.17CR(6.40Cr~ Gross)
10.50 కోట్ల టార్గెట్ కి ఇంకా 7.33 కోట్ల షేర్ దూరంలో ఉంది సినిమా..

Suriya RETRO Movie 2 Days Total WW Collections!!

ఇక సినిమా 5వ రోజున వరల్డ్ వైడ్ గా ఓవరాల్ గా 6.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 3.20 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఓకే అనిపించుకుంది కానీ టార్గెట్ ను అందుకోవడం కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా టోటల్ గా 5 రోజుల్లో…

వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
 Suriya RETRO Movie 5 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 38.30Cr
👉Telugu States – 6.40Cr
👉Karnataka – 9.50Cr
👉Kerala – 4.00Cr
👉Hindi+ROI – 1.20Cr
👉Overseas – 19.80Cr***approx
Total WW collection – 79.20CR(39.65CR~ Share) Approx
(48% Recovery)

ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 82 కోట్ల రేంజ్ లో టార్గెట్ తో బరిలోకి దిగగా క్లీన్ హిట్ కోసం ఇంకా 42.35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుని పరుగును కొనసాగిస్తుందో చూడాలి.

Suriya RETRO Movie 5 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here