Home న్యూస్ ఫస్ట్ టైం 8 కోట్లు….రీ రిలీజ్ లో చరిత్ర సృష్టిస్తున్న చిన్న సినిమా!!

ఫస్ట్ టైం 8 కోట్లు….రీ రిలీజ్ లో చరిత్ర సృష్టిస్తున్న చిన్న సినిమా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడో 9 ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యి అంచనాలను అందుకోలేక పోయిన చిన్న సినిమా సనం తేరీ కసం(Sanam Teri Kasam) మూవీ హిందీలో బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో 8 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. కానీ తర్వాత టైంలో టెలివిజన్ లో డిజిటల్ లో సినిమా కి కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది…దాంతో సినిమాను రీసెంట్ గా…

థియేటర్స్ లో రీ రిలీజ్ చేయగా, ఆడియన్స్ నుండి ఊహకందని రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అయ్యింది ఈ సినిమాకి, ఓ రేంజ్ లో ఎగబడి థియేటర్స్ కి వెళ్లి మరీ సినిమాను చూస్తూ ఉండటంతో బాలీవుడ్ లో రీ రిలీజ్ మూవీస్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా..

మొదటి వీకెండ్ లోనే ఏకంగా 15.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన తర్వాత స్లో అవుతుంది అనుకున్నా కూడా అలాంటిది ఏమి లేకుండా 4వ రోజున 3 కోట్లు, 5వ రోజున 3.2 కోట్లు వసూల్ చేసి ఫెంటాస్టిక్ హోల్డ్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉండగా…

సినిమా 5 రోజుల్లో ఓవరాల్ గా ఇండియాలో 21.7 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు 8 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ తో డిసాస్టర్ అయిన సినిమా ఇప్పుడు రీ రిలీజ్ లో మొదటి వారంలో 28-30 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం…

కనిపిస్తూ ఉండటంతో బాలీవుడ్ లో రీ రిలీజ్ లలో ఈ చిన్న సినిమా ఎపిక్ రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతుంది. సినిమా కి సెకెండ్ వీకెండ్ లో పోటిలో కొత్త సినిమాలు ఉన్నా కూడా వాలెంటైన్ వీకెండ్ అడ్వాంటేజ్ తో మరింత రచ్చ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండటం విశేషం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here