బాక్స్ ఆఫీస్ దగ్గర ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) రీసెంట్ టైంలో వరుస పెట్టి మాస్ మూవీస్ తో రచ్చ చేస్తుండగా ఆ సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ వస్తూ ఉండటం విశేషం. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో బిగ్ మాస్ డైరెక్టర్ లో ఒకరైన…
బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రామ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద(Skanda) ఆడియన్స్ ముందుకు ఈ నెల 15న ముందు రిలీజ్ ను అనౌన్స్ చేసినా కూడా ఇప్పుడు ఈ నెల ఎండ్ లో రావాల్సిన మమ్మోత్ మూవీ అయిన సలార్(Salaar) సినిమా…
రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వడంతో ఆ డేట్ కి వరుస పెట్టి ఇతర సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా 5 రోజుల లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ కి తగ్గ సినిమా రిలీజ్ అయితే కచ్చితంగా వసూళ్లు ఓ రేంజ్ లో ఉంటాయని అందరూ అనుకుంటూ ఉన్న టైం లో…
ఇప్పుడు స్కంద సినిమాను సెప్టెంబర్ 15న నుండి పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు సెప్టెంబర్ 28 న రిలీజ్ కాబోతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు… దాంతో పోటి ఎంత ఉన్నప్పటికీ ఆ డేట్ కి మాస్ ఆడియన్స్ తో పాటు అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను మెప్పించే సినిమా ఇదే అవ్వడంతో…
సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 2 వరకు 5 రోజుల లాంగ్ ఎక్స్ లెంట్ వీకెండ్ లో స్కంద సినిమా మినిమం బాగుంది అనిపించే టాక్ ను సొంతం చేసుకుంటే ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.