బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిన కమల్ హాసన్ (Kamal Haasan)…శింబు(Simbhu) నటించిన తగ్ లైఫ్(Thug Life Movie) మూవీ మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా ఏ దశలో కూడా కలెక్షన్స్ పరంగా ఇంపాక్ట్ ని చూపించ లేక పోయింది అని చెప్పాలి ఇప్పుడు…
వీకెండ్ ని ఎలాగోలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన సినిమా అన్ని చోట్లా అనుకున్న దాని కన్నా కూడా దారుణంగా డ్రాప్స్ ను సొంతం చేసుకుని అత్యంత తీవ్రంగా నిరాశ పరిచే కలెక్షన్స్ ని అందుకుంది…
సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 5వ రోజున డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి సొంతం చేసుకోగా అతి కష్టం మీద అవేవి తీయకుండా 8 లక్షల రేంజ్ లో షేర్ ని సాధించగా 5 రోజుల్లో టోటల్ గా 2.02 కోట్ల షేర్ ని అందుకోగా క్లీన్ హిట్ కోసం ఇంకా 9.98 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాల్సిన అవసరం ఉంది.
ఇక 5వ రోజున వరల్డ్ వైడ్ గా కేవలం 2.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా దారుణంగా నిరాశపరిచింది. దాంతో టోటల్ గా 5 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Thug Life Movie 5 Days Total WW Collections Approx
👉Tamilnadu – 33.80Cr
👉Telugu States – 3.85Cr
👉Kerala – 2.40Cr
👉Hindi+ROI – 4.10Cr
👉Overseas – 34.35Cr***approx
Total WW collection – 78.50CR(38.60CR~ Share) Approx
(36%~ Recovery)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 106.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 67.90 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా భారీ డిసాస్టర్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర.