నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపగా సినిమా 4 రోజుల వీకెండ్ లో ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత అంటే ఇదే అనిపించే రేంజ్ లో కలెక్షన్స్ జాతరని సొంతం చేసుకుంది. అలాంటి వీకెండ్ తర్వాత ఇప్పుడు సినిమా వర్కింగ్ డే లో ఎంటర్ అయింది.
4 రోజుల వీకెండ్ పూనకాలు తెప్పించే కలెక్షన్స్ జాతర తర్వాత వర్కింగ్ డే ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుంది అన్ని సినిమాలకు కూడా…. అఖండ కి కూడా ఇదే విధంగా ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర… వర్కింగ్ డే ఎఫెక్ట్ వలన 4 వ రోజుతో పోల్చితే 5 వ రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ…
షోలకు డ్రాప్స్ ఆల్ మోస్ట్ 60%-65% కి పైగా ఉన్నాయి అన్ని సెంటర్స్ లో కూడా. సీడెడ్ లో పర్వాలేదు అనిపించే విధంగా ఉండగా గుంటూరు అండ్ నెల్లూరులో కూడా బాగానే ఉన్నాయి. నైజాంలో ఎక్కువ థియేటర్స్ వలన డ్రాప్స్ ఎక్కువ అనిపించడం జరుగుతుంది. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్…..
మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతూ ఉండటంతో ఈ రోజు మొత్తం మీద మరీ అద్బుతమైన హోల్డ్ కాక పోయినా కానీ పర్వాలేదు అనిపించే హోల్డ్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద డ్రాప్స్ ను బట్టి చూస్తుంటే ఈ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2.6 కోట్ల నుండి 3 కోట్ల వరకు షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది.
ఒకవేళ ఈవినింగ్ అండ్ నైట్ షోలలో గ్రోత్ బాగుండి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో జోరు పెరిగితే సినిమా 3.5 కోట్ల రేంజ్ దాకా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది… కానీ 4 కోట్ల రేంజ్ కి చేరితే ఎక్స్ లెంట్ అనిపించేలా సినిమా హోల్డ్ చేసింది అని చెప్పొచ్చు. మరి సినిమా రోజు ముగిసే సమయానికి ఎక్కడి దాకా వెల్లగలదో చూడాలి ఇక…