బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ది వారియర్ మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో ఓవరాల్ గా పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధించిన అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా గట్టి హోల్డ్ ని చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా 5వ రోజు తొలి వర్కింగ్ డే లో అడుగు పెట్టగా బుకింగ్స్ పరంగా మాత్రం ఆన్ లైన్ సేల్స్ ఏమాత్రం ఇంప్రూవ్ మెంట్ లేదు…
ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కొన్ని సెంటర్స్ లో పరిశీలించగా ఆల్ మోస్ట్ 55-60% రేంజ్ లో డ్రాప్స్ కనిపించాయి. ఇవే విధంగా అన్ని సెంటర్స్ లో ఉంటె సినిమా మొత్తం మీద 5వ రోజు 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు.
ఇక అన్ని చోట్లా రిపోర్ట్స్ బాగుంటే సినిమా 1.4 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 1.5 కోట్ల దాకా వెళ్ళే ఔట్ రైట్ చాన్స్ ఉంది, మరి సినిమా ఓవరాల్ గా ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుని హోల్డ్ చేస్తుందో చూడాలి. బ్రేక్ ఈవెన్ దృశ్యా ఈ కలెక్షన్స్ కూడా సరిపోవు అనే చెప్పాలి.