Home TRP రేటింగ్ ఎవరు మీలో కోటీశ్వరులు 5th వీక్ TRP రేటింగ్…తగ్గినా ఇదీ రికార్డే!!

ఎవరు మీలో కోటీశ్వరులు 5th వీక్ TRP రేటింగ్…తగ్గినా ఇదీ రికార్డే!!

800
0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై 4 ఏళ్ల తర్వాత కంబ్యాక్ చేసిన షో ఎవరు మీలో కోటీశ్వరులు, ఆల్ రెడీ పాతాళానికి పడిపోయిన ఈ షో ని టేక్ ఆఫ్ చేయడమే పెద్ద విషయం అంటే నాన్ స్టాప్ గా మూడు వారాల పాటు అద్బుతమైన రేటింగ్ లతో ఈ షో ను నిలబెట్టాడు ఎన్టీఆర్, కానీ ప్రశ్న జవాబుల తోనే సరిపెట్టుకునే ఈ షో కన్నా ఎంటర్ టైన్ మెంట్ ని అందించే ఇతర షోలు చాలానే…

పోటి లో ఉండటం లాంటివి లాంగ్ రన్ లో రేటింగ్ ల పై ఇంపాక్ట్ చూపుతున్నాయి, దాంతో రేటింగ్ లు తగ్గాయి, లేటెస్ట్ గా 4 వ వారం తో పోల్చితే 5 వ వారం రేటింగ్ లలో మరింత డ్రాప్ కనిపించింది, ఓపెనింగ్ వీక్ 6.76 రేటింగ్ ను….

సొంతం చేసుకున్న ఈ షో, రెండో వారంలో 6.48 రేటింగ్ ను దక్కించుకుంది. ఇక మూడో వారంలో రెట్టించిన జోరు చూపెట్టిన ఈ షో ఏకంగా 7.3 రేటింగ్ తో దుమ్ము లేపగా నాలుగో వారం లో 6.59 రేటింగ్ ఓవరాల్ గా సొంతం చేసుకుని బాగా హోల్డ్ చేసింది కానీ కొంచం తగ్గింది…

ఇక ఇప్పుడు 5 వ వారం విషయానికి వస్తే రేటింగ్ మరింత తగ్గి 4.7 రేటింగ్ ను 5 వ వారం యావరేజ్ గా సొంతం చేసుకుంది ఈ షో, అంటే ఆల్ మోస్ట్ 2 రేటింగ్ పాయింట్స్ ని ఒక్క వారంలో కోల్పోయింది. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే 5 వ వారం ఓవరాల్ గా అన్ని సీజన్స్ లో ఇదే బెస్ట్ హోల్డ్ అని విశ్లేషకులు చెబుతూ ఉండటం విశేషం…

అయినా కానీ ప్రజెంట్ టైం నే చూసుకుంటే ఓవరాల్ గా మొదటి వారాలతో పోల్చితే ఇప్పుడు రేటింగ్ లు తగ్గుముఖం పట్టాయి. ఇక వచ్చే వారాల్లో ఎలా హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా ఎన్టీఆర్ మహేష్ బాబు ల స్పెషల్ ఎపిసోడ్ త్వరలోనే టెలికాస్ట్ కానుంది, ఆ ఎపిసోడ్ కి ఎలాంటి రేటింగ్ లు వస్తాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here