ఊహకందని రేంజ్ లో ఈ ఆగస్టు 15 వీకెండ్ లో రిలీజ్ అయిన అన్ని సినిమాల్లోకి ఎలాంటి అంచనాలను లేని విధంగా వచ్చిన ఆయ్ మూవీ(AAY Movie) ఊహకందని రేంజ్ లో జోరు చూపించి దుమ్ము లేపే రేంజ్ లో పాజిటివ్ టాక్ పవర్ తో వీకెండ్ ఎండ్ అయ్యే టైంకి సినిమా బ్రేక్ ఈవెన్ ని దాటేసి సంచలనం సృష్టించగా…
అన్ని చోట్లా మంచి లాభాలను సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా సినిమా 5వ రోజు రాఖీ పండగ హాలిడే అడ్వాంటేజ్ తో మరోసారి మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండగా సినిమా కి వీకెండ్ తర్వాత కొంచం డ్రాప్స్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా చూసుకుంటే….
మిగిలిన సినిమాలు అన్నింటి కన్నా కూడా బెటర్ గా ట్రెండ్ ను చూపెడుతూ మరోసారి పెద్ద సినిమాలను అన్నింటినీ తొక్కేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం. ఓవరాల్ గా సినిమా ఇప్పుడు 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అటూ ఇటూగా…
55-60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉండగా మిగిలిన సినిమాలు అన్నీ కూడా హెవీ గా డ్రాప్స్ ను ఈ రోజు సొంతం చేసుకోగా…
ఆయ్ మూవీ మాత్రం బాగానే హోల్డ్ ని చూపెడుతూ ఉండటం విశేషం, ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకున్న ఆయ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక టోటల్ గ 5 రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.