బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్(Prabhas) ఆదిపురుష్(adipurush) మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి 3 రోజుల్లో రిమార్కబుల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన తర్వాత వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా 4వ రోజు ఊహకందని రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు…
5వ రోజు మరో వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అయిన సినిమా ఒక్క హైదరాబాదు లో మాత్రం పర్వాలేదు అనిపిస్తున్న మిగిలిన చోట్ల మాత్రం డ్రాప్స్ ఎక్కువగానే ఉండటం విచారకరం అని చెప్పాలి ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 30-35% రేంజ్ లో డ్రాప్స్ ఉండటంతో…
సినిమా 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అటూ ఇటూగా 3 కోట్ల రేంజ్ నుండి 3.2 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ అసలు దరిదాపుల్లోకి కూడా వెళ్ళడానికి సరిపోవు అని చెప్పాలి ఇప్పుడు.
ఇక హిందీలో సినిమా ఈ రోజు 5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా టోటల్ గా సినిమా 5వ రోజు వరల్డ్ వైడ్ గా 7.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…
8 కోట్ల దాకా షేర్ ని సాధించే అవకాశం ఉంది. కానీ సినిమా అందుకోవాల్సిన బ్రేక్ ఈవెన్ టార్గెట్ దృశ్యా ఇంకా ఎక్కువ వసూళ్ళని సాధించాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా టోటల్ గా 5 రోజులకు గాను సాధించే అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.