లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు డీసెంట్ అంచనాల నడుమ రిలీజ్ అయిన నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie) పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం…
పెద్దగా ఇంపాక్ట్ ను ఏమి చూపించ లేక పోయింది. సినిమా మొదటి వర్కింగ్ డే లో ఆల్ మోస్ట్ 60% కి పైగానే డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు 5వ రోజున మరో వర్కింగ్ డే లో ఎంటర్ అవ్వగా మేజర్ సెంటర్స్ లో లిమిటెడ్ డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ..
ఎంతో కొంత పర్వాలేదు అనిపించేలానే జోరుని చూపెడుతుంది కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ అసలు ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి ఇప్పుడు. ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 35-40 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా, ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే సినిమా షేర్ మరికొంత పెరిగే అవకాశం ఉంది. ఇక్కడతో పాటు సినిమా ఓవర్సీస్ లో అనుకున్న దాని కన్నా కూడా…
ఎక్కువ గానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 5వ రోజున 45 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజులకు గాను సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.