మొదటి వీకెండ్ లో ఎలాగోలా పర్వాలేదు అనిపించే రేంజ్ లో హోల్డ్ చేసినా వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అవుతూ కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంటున్న బెల్లంకొండ శ్రీనివాస్(BellamKonda Srinivas) నారా రోహిత్(Nara Rohit)-మంచు మనోజ్(Manchu Manoj) కీలక పాత్రలు పోషిస్తున్న భైరవం(Bhairavam Movie) మూవీ…
అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉండగా…4వ రోజున 14.5 వేల రేంజ్ లోనే టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా 5వ రోజున మరో వర్కింగ్ డే లో అడుగు పెట్టిన సినిమా మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకుంది..
ట్రాక్ చేసిన సెంటర్స్ లో ఆల్ మోస్ట్ 20% రేంజ్ లో డ్రాప్స్ అయితే కనిపిస్తూ ఉండగా నైట్ షోలకు IPL ఫైనల్ మ్యాచ్ ఇంపాక్ట్ కూడా ఉండే అవకాశం ఉండగా ఓవరాల్ గా సినిమా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే ఓవరాల్ గా 5వ రోజున తెలుగు రాష్ట్రాల్లో..
అటూ ఇటూగ 40-45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అమెరికాలో బిలో పార్ లెవల్ లోనే…
హోల్డ్ ని చూపెడుతూ ఉండగా మొత్తం మీద 5వ రోజు వరల్డ్ వైడ్ గా 50 లక్షల రేంజ్ నుండి ఆ పైన షేర్ ని కొద్ది వరకు అందుకునే అవకాశం ఉంది, ఓవరాల్ గా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇవి సరిపోవు అనే చెప్పాలి. ఇక టోటల్ గా 5 రోజుల్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.