టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన లేటెస్ట్ మూవీ భోలా శంకర్(Bholaa Shankar) సినిమా ఇండిపెండెన్స్ వీకెండ్ లో కలెక్షన్స్ తో రచ్చ చేస్తుంది అనుకున్నా కూడా సినిమా ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయిన సినిమా మొత్తం మీద….
వీకెండ్ లోనే చేతులు ఎత్తేసిన తర్వాత 4వ రోజు వర్కింగ్ డే లో ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయింది. ఆల్ మోస్ట్ 90% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా 5వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండిపెండెన్స్ డే హాలిడే లభించినా కూడా…
ఏమాత్రం హోల్డ్ ని అయితే చూపించ లేకపోతుంది సినిమా. ఉన్నంతలో కొన్ని చోట్ల కొంచం గ్రోత్ ఉన్నప్పటికీ ఆడియన్స్ ఫస్ట్ చాయిస్ మాత్రం రజినీకాంత్(Rajinikanth) నటించిన జైలర్(Jailer Movie) అవ్వడంతో భోలా శంకర్ ఏమాత్రం హోల్డ్ చేయలేక పోయింది…
మొత్తం మీద సినిమా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అటూ ఇటూగా 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవర్సీస్ లో కూడా ఏమాత్రం హోల్డ్ ని చూపించలేక పోతున్న సినిమా…
ఓవరాల్ గా ఈ రోజు ఒక్కటే బిగ్ డే గా చెప్పాలి. తర్వాత మరింత డ్రాప్స్ ను వర్కింగ్ డేస్ ను ఫేస్ చేస్తూ ఉండటంతో ఇక తేరుకునే అవకాశం లేదనే చెప్పాలి ఇప్పుడు. ఇక మొత్తం మీద సినిమా 5 రోజుల్లో సాధించే అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఏ విధంగా ఉంటుందో చూడాలి.