మొదటి ఎక్స్ టెండెడ్ 4 డేస్ వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దులిపేసిన నాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ దసరా ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా 5వ రోజున వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన అనుకున్న దాని కన్నా కూడా కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది ఇప్పుడు… మొదటి 2 షోలకు ఆల్ మోస్ట్ 65% రేంజ్ లో….
డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కొంచం గ్రోత్ ని చూపించినా ఓవరాల్ గా డ్రాప్స్ అయితే 60% రేంజ్ లో ఉన్నాయి. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజున అటూ ఇటూగా ఇప్పుడు…
2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 2.7 కోట్ల దాకా షేర్ ని అందుకోవచ్చు. సినిమా 2.8 కోట్ల నుండి 3 కోట్ల లోపు షేర్ ని అందుకుంటే ఈ రోజు ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసిందని చెప్పొచ్చు ఆ మార్క్ ని అందుకోవాలి అంటే…
సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ మరింత స్ట్రాంగ్ గా ఉండాల్సి ఉంటుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ అఫీస్ దగ్గర 3.3-3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక టోటల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజులకు గాను సాధించే అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.