బాక్స్ ఆఫీస్ దగ్గర రవితేజ లేటెస్ట్ మూవీ ధమాకా మొదటి వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా 4వ రోజు పార్షిక హాలిడే అడ్వాంటేజ్ తో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా 5వ రోజు ఫుల్ వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అవ్వగా అన్ని చోట్లా సినిమా ఆల్ మోస్ట్ 50% రేంజ్ లో…
డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కానీ తిరిగి ఈవినింగ్ షోల నుండి సినిమా మంచి జోరునే చూపిస్తూ వర్కింగ్ డే టెస్ట్ లో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ వర్కింగ్ డే టెస్ట్ ను పాస్ అయింది అనే చెప్పాలి ఇప్పుడు.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.7 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు కూడా బాగుండే అవకాశం ఉన్న నేపధ్యంలో 2 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 2.2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద వర్కింగ్ డే టెస్ట్ లో మంచి కలెక్షన్స్ తో రన్ అవుతున్న సినిమా ఇంతకన్నా ఎక్కువ కలెక్ట్ చేస్తే సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని చెప్పొచ్చు.