బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ మిక్సుడ్ టాక్ వలన అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేక పోతూ ఉండగా సంక్రాంతి సెలవులలో కుమ్మేస్తుంది అనుకున్నా కూడా కొత్త సినిమాల టాక్ బెటర్ గా ఉండటంతో గేమ్ చేంజర్ మీద బెటర్ కలెక్షన్స్ ని సాధిస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండగా ఇప్పుడు ఎట్టకేలకు 5వ రోజున..
సినిమా కి కొంచం గ్రోత్ కనిపించింది అని చెప్పాలి. ప్రతీ రోజూ ప్రీవియస్ డే తో పోల్చితే డ్రాప్స్ వస్తూనే ఉండగా 5వ రోజు సంక్రాంతి పండగ హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో సినిమా అన్ని చోట్లా పర్వాలేదు అనిపించేలా గ్రోత్ ని చూపెడుతూ దూసుకు పోతుంది….తెలుగు రాష్ట్రాల్లో కొత్త సినిమాల ఓవర్ ఫ్లో కూడా…
గేమ్ చేంజర్ మూవీ కి ఇప్పుడు కలిసి వస్తుంది అని చెప్పాలి ఇప్పుడు…ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా 5వ రోజున అటూ ఇటూగా 4 కోట్ల రేంజ్ నుండి ఆ పైన షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇక సినిమా హిందీ లో కొంచం గ్రోత్ ని చూపించగా 3 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక తమిళ్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో ఈ రోజు 40-50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో మాత్రం సినిమాకి అనుకున్న రేంజ్ లో హోల్డ్ కనిపించడం లేదు…
ఉన్నంతలో ఓకే అనిపించేలా పెర్ఫార్మ్ చేస్తూ ఉండటంతో సినిమా 5వ రోజున వరల్డ్ వైడ్ గా 6.5-7 కోట్ల రేంజ్ దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం పెరగవచ్చు. ఓవరాల్ గా సినిమా అందుకోవాల్సిన మమ్మోత్ టార్గెట్ ను అందుకోవడానికి ఈ…
కలెక్షన్స్ సరిపోకపోయినా కూడా ఉన్నంతలో నష్టాలను పర్వాలేదు అనిపించేలా తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్న గేమ్ చేంజర్ మూవీ ఇలానే లాంగ్ రన్ ను వీక్ మొత్తం సొంతం చేసుకోగలిగితే కొంచం బెటర్ అని చెప్పాలి. ఇక టోటల్ గా సినిమా 5 రోజుల కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇక…