కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ధనుష్(Dhanush)ల కాంబో మూవీ కుబేర(Kuberaa Movie) సినిమా వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా సినిమా తెలుగు వర్షన్ ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ ఉండగా తమిళ్ వర్షన్ మాత్రం అనుకున్న రేంజ్ లో హోల్డ్ ని చూపించ లేక పోతుంది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 5వ రోజు మరోసారి వర్కింగ్ డే లో ఎంటర్ అవ్వగా మరోసారి తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ ఉన్న సినిమా డే 4 తో కంప్లేర్ చేస్తే 20-25% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా….
ఉన్నంతలో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజున మొత్తం మీద 2.5 కోట్ల రేంజ్ నుండి 2.6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా తమిళ్ లో సినిమా 50 లక్షల రేంజ్ లో 55 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది..ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో పర్వాలేదు అనిపించే రేంజ్ లో హోల్డ్ ని చూపెడుతున్న సినిమా ఓవర్సీస్ లో కూడా ఈ రోజు ట్యూస్ డే ఆఫర్స్ తో కలిసి మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 5వ రోజున ఇప్పుడు 4.2-4.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది.
ఇక ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద తెలుగు వర్షన్ మరోసారి స్ట్రాంగ్ హోల్డ్ ని చూపెడుతూ ఉండగా తమిళ్ వర్షన్ ఇంకా హోల్డ్ ని చూపించాల్సిన అవసరం ఉంది. ఇక టోటల్ గా 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.