బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా సినిమాల సందడి మొదలు అయ్యి మొదటి వీకెండ్ పూర్తి అవ్వగా ఇవాల్టి నుండి పండగ హాలిడేస్ స్టార్ట్ అవ్వగా కొన్ని చోట్ల పార్షిక హాలిడే కొన్ని చోట్ల ఫుల్ హాలిడే ఉండగా అన్ని సినిమాలు ఈ రోజు ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాయి అన్నది ఆసక్తిగా మారింది. మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ…
టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమా మరోసారి పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తున్నప్పటికీ కూడా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ సరిపోవు అనే చెప్పాలి. సినిమా 3వ రోజుతో పోల్చితే కొన్ని చోట్ల సిమిలర్ గా కొన్ని చోట్ల డ్రాప్స్ ను సొంతం చేసుకోగా మొత్తం మీద ఈ రోజు సినిమా…
తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల నుండి 2.2 కోట్ల దాకా షేర్ ని వరల్డ్ వైడ్ గా 2.6 కోట్ల నుండి 2.8 కోట్ల దాకా షేర్ ని అందుకోవచ్చు కానీ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కీలకమని చెప్పాలి. ఇక నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా 4వ రోజు తో పోల్చితే…
5వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆంద్రలో మరోసారి మంచి జోరుని చూపిస్తూ ఉండగా నైజాంలో మాత్రం సినిమాకి డ్రాప్స్ ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 4.5-5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే లెక్క పెరగవచ్చు.
వరల్డ్ వైడ్ గా సినిమా 5.7 కోట్లకు అటూ ఇటూగా షేర్ ని అందుకోవచ్చు. ఇక లియో మూవీ తెలుగు లో డ్రాప్ అయింది. ఈ రోజు సినిమా బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 1.5 కోట్లకు అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా 45 కోట్ల నుండి 50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది, ఇక అన్ని సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.