మొదటి వీకెండ్ లోనే కలెక్షన్స్ పరంగా కంప్లీట్ గా అండర్ పెర్ఫార్మ్ చేసిన లైగర్ మూవీ వీకెండ్ తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన లైగర్ సినిమా 5వ రోజు వర్కింగ్ డే లో మరింత స్లో డౌన్ అయింది. వీకెండ్ లోనే చతికిలబడిన సినిమా వర్కింగ్ డే కి వచ్చే సరికి ఆల్ మోస్ట్ 50% రేంజ్ లో డ్రాప్ అయింది తెలుగు రాష్ట్రాల్లో. ఇక హిందీలో మాత్రం సినిమా…
40% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా మొత్తం మీద ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 25 లక్షల నుండి 30 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు….
అటూ ఇటూగా 1.1 కోట్ల నుండి 1.3 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇందులో హిందీలో సినిమా 1.8 కోట్లకి అటూఇటూగా నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా వర్కింగ్ డే లో సినిమా కంప్లీట్ గా చేతులు ఎత్తేసింది ఇప్పుడు…
దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో చరిత్రలో నిలిచిపోయే నష్టాలను సొంతం చేసుకోవడం కన్ఫాం అవ్వగా సినిమా ఆల్ మోస్ట్ ఇక ఎపిక్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా మారింది. తెలుగు రాష్ట్రాలలో సినిమాను కొన్న బయ్యర్లకు థియేటర్స్ ఓనర్స్ కి సినిమా ఇప్పుడు ఊహకందని నష్టాలు సొంతం అవ్వడం ఖాయంగా మారగా మిగిలిన రోజుల్లో సినిమా ఇప్పుడు…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. మొత్తం మీద భారీ టార్గెట్ దృశ్యా సినిమా ఇక తేరుకునే అవకాశం లేనట్లే అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 5 రోజులకు గాను సాధించే అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఎలా ఉంటుందో చూడాలి….