మొదటి 4 రోజుల లాంగ్ ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ ఇండియన్ మూవీస్ లో ఎపిక్ కలెక్షన్స్ రికార్డులను నమోదు చేస్తూ ఏకంగా 800 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని అందుకుని సంచలనం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా…
ఇప్పుడు వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టింది…ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే ఎక్స్ లెంట్ హోల్డ్ తో పరుగును కొనసాగిస్తూ దుమ్ము లేపుతుంది సినిమా….తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే సినిమా 4వ రోజుతో కంపేర్ చేస్తే 5వ రోజున ఆల్ మోస్ట్ 70% రేంజ్ లో…
డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో…దాంతో సినిమా ఈ రోజు ఇక్కడ 7.5-8.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు జోరుని కనుక చూపిస్తే సినిమా 9-10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది…
ఇక తమిళ్ మరియు కర్ణాటకలో కూడా డ్రాప్స్ గట్టిగానే ఉండగా కేరళతో కలిపి ఈ మూడు చోట్ల సినిమా 5-6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఇక హిందీలో మాత్రం సినిమా హోల్డ్ రేంజ్ మరో లెవల్ లో దూసుకు పోతూ ఉంది… సినిమా అక్కడ రెండో రోజు 59 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా…
రెండో రోజు బుకింగ్స్ ట్రెండ్ లో అటూ ఇటూగా 30-35% రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా హిందీలో ఈ రోజు సినిమా 40 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్ లో సినిమా 1 మిలియన్ కి పైగా డాలర్స్ ను అందుకునే అవకాశం ఉండగా…
టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు 5వ రోజున 38-40 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. ఓవరాల్ గా సినిమా ఇదే రేంజ్ లో షేర్ ని అందుకుంటే ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించినట్లు…ఇంతకన్నా ఎక్కువ కలెక్షన్స్ వస్తే ఊరమాస్ హోల్డ్ ని చూపించింది అని చెప్పొచ్చు…